Monday, May 9, 2011

శ్రీ రాముల దివ్య నామ స్మరణ



పాట పాడిన వారు: రాధేశ్యాం

శ్రీ రాముల దివ్య నామ స్మరణ సేయుచున్న చాలు/ ఘోరమైన తపములను కోర నేటికే మనసా//
తారక శ్రీ రామనామ ధ్యానము చేసిన చాలు వేరువేరు దైవములను వెదక నేటికే మనసా //శ్రీ రాముల


భాగవతుల పాద జలము - పైన జల్లుకొన్న చాలు /భాగీరధికి పోయ్యేననే - భ్రాంతి యేటికే //
భాగవతుల వాగామృతము - పానము చేసిన చాలు/ బాగుమీర నట్టి యమృత - పానమేటికే మనసా //శ్రీ రాముల


పరులహింస సేయకున్న - పరమధర్మ మంతే చాలు / పరుల రక్షింతునని - పల్కనేటికే //
దొరకని పరుల ధనముల - దోచక యుండితే చాలు /గురుతుగాను గోపురము - గట్ట నేటికే మనసా //శ్రీ రాముల



అతిధి వచ్చి ఆకలన్న అన్నమింత నిడిన చాలు / క్రతువు సేయ వలెననే - కాంక్ష యేటికే //

సతతము మా భద్రగిరి - స్వామి రామదాసుడైన / ఇతర మతములనియేటి - వెతల వేటికే మనసా //శ్రీ రాముల

3 comments:

  1. భద్రాచల రామదాసుగా ఖ్యాతి గాంచిన కంచర్ల గోపన్న వ్రాసిన కీర్తన ఇది. సావేరి రాగంలో శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారిచే స్వరపరచబడింది. కొందరు కేవలం వాగాడంబారమే కానీ చేతలలో చేసి చూపేది ఉండదు. అటువంటివారి మాటల్లోని డొల్లతనాన్ని బయటపెడుతూ ఆచరణలో చేయగలిగే చిన్న చిన్న మంచిపనులను చెబుతున్నారు మన రామదాసు.

    ReplyDelete
  2. Radhesyam jee, Well sung. I am recording the song at my end.

    ReplyDelete
  3. రాధేశ్యాం గారూ, మీరు పాడిన పాట చాలా అర్ధవంతం గా ఉండి వినటానికి సొంపుగా ఉన్నది. మీరు ఇచ్చిన కీర్తన పాఠం చూస్తూ వినటం వల్ల పాట పూర్తిగా అర్ధం అయ్యింది. రామదాసు గారు వ్రాసినది అక్షర సత్యం. బేషజాలు లేని భక్తి గురించి ఈ కీర్తనలో చక్కగా వివరించారు.

    ReplyDelete

* దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
* వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!