:: అన్నమాచార్య కీర్తన ::
రాగం: గౌళ , గానం: బాలమురళి కృష్ణ
ప. ఎన్నడు తీరవు ఈపనులు
చ. పెక్కుమతంబుల పెద్దలునడచిరి
ఒక్కసమ్మతై ఓడబడరు
పెక్కుదేవతలు పేరు ఆడెదరు
తక్కక ఘనులము తామేఅనుచు ||ఎన్నడు||
చ. పలికెడి చదువులు బహుమార్గంబులు
కలసి ఏకవాక్యత కాదు
చలవాదంబులు జనులు మానరు
పలు తర్కంబులె పచరించేరు ||ఎన్నడు||
చ. శరణాగతులకు శ్రీవేంకటేశ్వర
తిరముగ నీవే తీర్చితివీ
పరమవైష్ణవులు పట్టిరివ్రతము
ఇరవుగ నాచార్యులెరుగుదురూ ||ఎన్నడు||
@@@@@@@@@@@@@@@
ఎవరి దారి వారిది, ఎవరి వాదం వారిది, ఎవరి (అభి)మతము వారిదిగా ఉండేటప్పుడు అందరూ ఒక ఏకాభిప్రాయానికి రాలేనప్పుడు " ఎన్నడు తీరవు ఈ పనులు" అని ఆవేదన చెందుతున్నాడు అన్నమయ్య. బాలమురళి పాటతో వినండి.
రాగం: గౌళ , గానం: బాలమురళి కృష్ణ
ప. ఎన్నడు తీరవు ఈపనులు
పన్నిన నీమాయ బహుళంబాయె ||ఎన్నడు||
చ. పెక్కుమతంబుల పెద్దలునడచిరి
ఒక్కసమ్మతై ఓడబడరు
పెక్కుదేవతలు పేరు ఆడెదరు
తక్కక ఘనులము తామేఅనుచు ||ఎన్నడు||
చ. పలికెడి చదువులు బహుమార్గంబులు
కలసి ఏకవాక్యత కాదు
చలవాదంబులు జనులు మానరు
పలు తర్కంబులె పచరించేరు ||ఎన్నడు||
చ. శరణాగతులకు శ్రీవేంకటేశ్వర
తిరముగ నీవే తీర్చితివీ
పరమవైష్ణవులు పట్టిరివ్రతము
ఇరవుగ నాచార్యులెరుగుదురూ ||ఎన్నడు||
@@@@@@@@@@@@@@@
|
ఎవరి దారి వారిది, ఎవరి వాదం వారిది, ఎవరి (అభి)మతము వారిదిగా ఉండేటప్పుడు అందరూ ఒక ఏకాభిప్రాయానికి రాలేనప్పుడు " ఎన్నడు తీరవు ఈ పనులు" అని ఆవేదన చెందుతున్నాడు అన్నమయ్య. బాలమురళి పాటతో వినండి.
గౌళ