రాముడుద్భవించినాడు రఘుకులంబున
కృతి కర్త: శ్రీ ప్రయాగ రంగదాసు రాగం: జోన్ పురి గాత్రం: డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ ప|| రాముడుద్భవించినాడు రఘుకులంబునా శ్రీ
||రాముడుద్భవించినాడు||
అ.ప|| తామసులను దునిమి దివిజ సోమంబుల క్షేమముకై కోమలి కౌసల్యకు
||రాముడుద్భవించినాడు||
చర|| తనరు చైత్ర శుధ్ధ నవమి పునర్వసందునా
సరస కర్కాటక లగ్నమరయగ సురవరులెల విని కురియింపగ విరుల వాన
||రాముడుద్భవించినాడు||
చర|| దశరధుండు భూసురులకు ధనమొసంగగా
విసరె మలయ మారుతములు దిశలెల్లను విశదములై వసుమతి దుర్భరము బాప
||రాముడుద్భవించినాడు||
చర|| ధరను గుడి మెళ్ళంక పురమును అరసి బ్రోవగా
కరుణతో శ్రీరంగదాసు మొరలిడగను కరుణుంచియు వరమివ్వగ స్థిరుడై
||రాముడుద్భవించినాడు||
శ్రీ మంగళంపల్లి బాలమురళి గాత్రం లోవినండి
http://www.sendspace.com/index.html?err=2&s=20
ReplyDelete-Ravali