Sunday, June 19, 2011

ఎన్నడు తీరవు ఈపనులు..! Annamacharya_Balamurali Krishna

:: అన్నమాచార్య కీర్తన ::
రాగం: గౌళ , గానం: బాలమురళి కృష్ణ

ప. ఎన్నడు తీరవు ఈపనులు
     పన్నిన నీమాయ బహుళంబాయె   ||ఎన్నడు||

చ. పెక్కుమతంబుల పెద్దలునడచిరి
     ఒక్కసమ్మతై ఓడబడరు
     పెక్కుదేవతలు పేరు ఆడెదరు
     తక్కక ఘనులము తామేఅనుచు            ||ఎన్నడు||

చ. పలికెడి చదువులు బహుమార్గంబులు
     కలసి ఏకవాక్యత కాదు
     చలవాదంబులు జనులు మానరు
     పలు తర్కంబులె పచరించేరు                 ||ఎన్నడు||

చ. శరణాగతులకు శ్రీవేంకటేశ్వర
     తిరముగ నీవే తీర్చితివీ
     పరమవైష్ణవులు పట్టిరివ్రతము
     ఇరవుగ నాచార్యులెరుగుదురూ             ||ఎన్నడు||
@@@@@@@@@@@@@@@

Get this widget | Track details | eSnips Social DNA 

ఎవరి దారి వారిది, ఎవరి వాదం వారిది, ఎవరి (అభి)మతము వారిదిగా ఉండేటప్పుడు అందరూ ఒక ఏకాభిప్రాయానికి రాలేనప్పుడు " ఎన్నడు తీరవు ఈ పనులు" అని ఆవేదన చెందుతున్నాడు అన్నమయ్య. బాలమురళి పాటతో వినండి.
గౌళ 

3 comments:

  1. రాధే శ్యాం గారూ,

    మనకున్న అనేక కీర్తనలనల్ని అర్ధాన్ని వివరిచే మీ ప్రయత్నం బాగున్నది. కొనసాగించండి. సామాన్యంగా కర్నాటక సంగీతం వింటూ తలలూపుతూ, తొడల మీద తాళం వేశే చాలామందికి అర్ధాలు తెలియవు, తెలిసినా వాటి గురించి ఆలోచించరు.ఆ అర్ధాలను గ్రహించి, వాటిని నలుగురికీ చెప్పి ఆచరింప చేయగలిగితే,వ్రాసిన ఆ మహామహుల ధ్యేయం పూర్తవుతుంది. వాగ్గేయకారులు తమ తమ అభిప్రాయాలను అద్భుతమైన కీర్తనల్లో నిక్షేపించి, సంగీతం ద్వారా అతే మనసుకు బాగా పడుతుందని అభిప్రాయపడ్డారు.

    అటువంటి కీర్తనలు ఈనాడు మరుగున పడకుండా, ఆ కీర్తనలను అర్ధాలతో సహా అదించటం బాగున్నది.

    కీర్తన పాఠం తరువాత విస్తృత అర్ధానికి పెద్ద పీట వేయగలరు. తద్వారా కొంత చర్చ జరిగితే ఆ అర్ధం ఎక్కువమందికి చేరే అవకాశం ఉన్నది.

    ReplyDelete
  2. good show. But I thought you are going to write more explanation

    ReplyDelete
  3. చాలా బాగుంది మీ ప్రయత్నం. అభినందనలు ,🙏🙏

    ReplyDelete

* దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
* వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!