రామ రామ యనరాదా రఘుపతి రక్షకుడని వినలేదా
రాగం: సింధుభైరవి రచన: ప్రయాగ రంగదాసు గాత్రం: బాలమురళి కృష్ణ
********************
ప|| రామ రామ యనరాదా రఘుపతి, రక్షకుడని వినలేదా
కామ జనకుని కదా వినువారికి కైవల్యంబే కాదా
అ.ప|| ఆపద్బాంధవుడగు శ్రీ రాముని ఆరాధింపక రాదా
పాపంబులు పరిహార మొనర్చేది పరమాత్ముండే కాదా
చర|| సారహీన సంసార భావాంబుధి సరగున దాటగరాదా
నీరజాక్షుని నిరతము నమ్మితె నిత్యానందామె కాదా
చర|| వసుధను గుడి మెల్లంకను వెలసిన వర గోపాలుడే కాదా
పసివాడగు శ్రీ రంగ దాసుని పాలించుట వినలేదా
రాగం: సింధుభైరవి రచన: ప్రయాగ రంగదాసు గాత్రం: బాలమురళి కృష్ణ
(శ్రీ ప్రయాగ రంగదాసు గారు బాలమురళి కృష్ణ గారి తాతగారు. ఈ పాట మా చిన్నప్పుడు రేడియోలో 'భక్తి రంజని' కార్యక్రమంలో వినిపించేది. ఇది కాక జంఝూటి రాగం లో 'రాముడుద్భవించినాడు రఘుకులంబున' కూడా చాలా బాగుంటుంది.)
ప|| రామ రామ యనరాదా రఘుపతి, రక్షకుడని వినలేదా
కామ జనకుని కదా వినువారికి కైవల్యంబే కాదా
అ.ప|| ఆపద్బాంధవుడగు శ్రీ రాముని ఆరాధింపక రాదా
పాపంబులు పరిహార మొనర్చేది పరమాత్ముండే కాదా
చర|| సారహీన సంసార భావాంబుధి సరగున దాటగరాదా
నీరజాక్షుని నిరతము నమ్మితె నిత్యానందామె కాదా
చర|| వసుధను గుడి మెల్లంకను వెలసిన వర గోపాలుడే కాదా
పసివాడగు శ్రీ రంగ దాసుని పాలించుట వినలేదా
ఇదే పాట ఇంకొక వేదిక పైన :
No comments:
Post a Comment
* దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
* వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.